Saturday, 24 September 2016

Janata Garage - Rock On Bro [Telugu Lyrics]





రాక్ ఆన్ బ్రో
అంది సెలవు రోజు
గడిపేద్దాం లైఫ్ కింగు సైజు
ఒకే గదిలో ఉక్కపోత చాలు.
గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు
ఏ దిక్కులో ఏమున్నదో
వేటాడి పోగుచేసుకుందాం కుషీ
మన్నాటలో చంటోడిలా
ఆహా అనాలినేడు మనలో మనిషి

ఓ.. ఓ.. ఓ.. ఓ.ఓ.ఓ.
ఓ.. ఓ.. ఓ.. ఓ.ఓ.ఓ.

మనసెప్పుడూ  మబ్బోలో విమానం
నేలైనా నింగితో సమానం
మత్తుల్లో ఇదో కొత్త కోణం
కొత్త ఎత్తుల్లో ఎగురుతుంది ప్రాణం
ఆనందమో.. ఆశ్చర్యమో..
ఏదోటి పొందలేని సమయం వృధా
ఉత్తెజమో.. ఉల్లాసమో..
ఇవ్వాల్టి నవ్వు రంగువేరే కదా..

ఓ.. ఓ.. ఓ.. ఓ.ఓ.ఓ.
ఓ.. ఓ.. ఓ.. ఓ.ఓ.ఓ.

మనమంతా జీన్సు పాంటు ఋషులూ
బ్యాక్ పేక్ లో బరువు లేదు అసలు
వినలేదా మొదటి మనిషి కధలు
 అలా బతికేద్దాము నిండు రేయి పగలూ

ఇదీ మనం  ఇదే మనం
క్షణాల్ని జీవితంగా
మార్చే గుణం
ఇదే ధనం.. ఈ ఇంధనం..
రానున్న రేపు వైపు నడిపే బలం

ఓ.. ఓ.. ఓ.. ఓ.ఓ.ఓ.
ఓ.. ఓ.. ఓ.. ఓ.ఓ.ఓ.



Rock on bro andhi selavu roju
Gadipedham life king size
Okke gadilo ukkapotha chaalu
Gadi dhaatali kallu kaalu kalalu

Ye dikkulo yemunnado
Vetaadi pogu chesukundham kushi
Mannatalo chantodila
‘Aa’ aanali nedu manalo manishi

Oh Oh Oh.. Oh O..
Manasu ippudu mabbulo vimanam
Nelaina ningitho samanam
Mathullo idho kotha konam
Kotha yethullo yeguruthondi pranam

Aanandamo aascharayamo
Yedhoti pondaleni samayam vrudha
Utthejamo ullasamoo..
Ivvalti navvu rangu vere kadha..

Oh Oh Oh.. Oh O..
Manamantha jeans pant rushulu
Backpack lo baruvu ledhu aasalu
Vinaledha modati manishi kadhalu
Aala bathikedham o nindu reyi pagalu

Idhi manam idhe manam
Kshanaalini jeevithanga marchegunam
Idhe dhanam ee indhanam
Raanunna repu vaipu nadipe balam




 

Vidhaata Thalapuna Song Lyrics | Sirivennela |




విధాత తలపున ప్రభవించినది అనాది జీవన వేదం...ఓం...
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం...ఓం...
కనుల కొలనులొ ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం...
ఎదకనుమలలో ప్రతిధ్వనించిన విరించిపంచి గానం....ఆ ఆ..

సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
నే పాడిన జీవన గీతం...ఈ గీతం..

విరించినై విరచించితిని ఈ కవనం..
విపంచినై వినిపించితిని ఈ గీతం....

ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఖ తంత్రులపైన..
జాగృత విహంగ తతులే వినీల గగనపు వెదిక పైన
ప్రాగ్దిస వేణీయ పైన దినకర మయూఖ తంత్రులపైన..
జాగృత విహంగ తతులే వినీల గగనపు వేదిక పైన
పలికిన కిలకిల త్వనముల స్వరగతి జగతికి శ్రీకారము కాగ..
విశ్వకార్యమునకిది భాష్యముగావిరించినై!!విరించినై!!

జనించు ప్రతిశిశు గళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
జనించు ప్రతిశిశు గల్ళమున పలికిన జీవననాద తరంగం
చేతన పొందిన స్పందన ధ్వనించు హృదయమృదంగధ్వానం
అనాదిరాగం ఆది తాళమున అనంత జీవన వాహిని గా..
సాగిన సృష్టి విలాసము నే!!విరించినై!!

నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
నా ఉచ్చ్వాసం కవనం నా నిశ్వాసం గానం
సరసస్వరసురఝరీగమనమవు సామవేద సారమిది...
నేపాడిన జీవన గీతం...ఈ గీతం..


Vidhata talapuna prabhavinchinadi anaadi jeevana vedam...ommm...
prananadulaku spandananosagina aadi pranavanaadam...om...
kanula kolanulo pratibimbinchina viswaroopa vinyaasamm...
edakanumalalo prathidhvaninchina virinchipanchi gaanam....aaa..

sarasaswarasurajhareegamanamavu samaveda saramidi...
nepaadina jeevana geetham...ee geetham..

virinchinai virachinchitini ee kavanam..
vipanchinai vinipinchithini ee geetham....

prathisa vaeneeya paina dinakara mayoogha tantrulapaina..
jagrutha vihanga tathulai vineela gaganapu vedica paina...::2::
palikina kilakila tvanamula swaragathi jagathiki sreekaramu kaaga..
viswakaryamunakidi bhashyamugaaa....

virinchinai.....

janinchu prathisishu galamuna palikina jeevananaada tarangam
chetana pondina spandana dhvaninchu hrudayamrudangadhvanam...:2:
anaadiraagam aadi talamuna anantha jeevana vaahini gaa..
saagina srushti vidhaanamu ne,,,

virinchinai...

naa uchwasam kavanam naa nishwasam gamanam....:2:
sarasaswarasurajhareegamanamavu samaveda saramidi...
nepaadina jeevana geetham...ee geetham..