వసంతాల ఈ గాలిలో గులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్య లో పరాగాల కవ్వింపులు
ఇవేనాటి క్రీనీడలో తుషారాల నీరెండలో
కుహూ మన్న ఈ గొంతులో ధ్వనించాయి లే ప్రేమలు.
వసంతాల ఈ గాలిలో గులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్య లో పరాగాల కవ్వింపులు
మేఘాల సందేశము ఆ ప్రేమ విరిజల్లులే
స్వప్నాల సంకేతము ఎదలోని హరివిల్లులే
మైనాల సంగీతమూ ఈ పూల గంధాలులే
ప్రతిరోజు సాయంత్రమూ నీ వేడి నిట్టూర్పులే
అది షోకమోఒక శ్లోకమో
ఈ లోకమే ప్రేమని.
వసంతాల ఈ గాలిలోగులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్య లో పరాగాల కవ్వింపులు
ప్రేమించి నా కళ్ళకు నిదురన్నదే రాదులే
ప్రేమించినా వాళ్లకు ఏ ఆకలి లేదులే
ఊహల్లో విహరింపులు ఉయ్యాల పవళింపులు
వెన్నెల్ల వేధింపులు వెచ్చంగ లాలింపులు
అది యోగమో అనురాగమో
పురి విప్పు ఈ ప్రేమనొ
వసంతాల ఈ గాలిలో గులాబీ గుబాళింపులు
సరాగాల ఈ సంధ్య లో పరాగాల కవ్వింపులు ఇవేనాటి క్రీనీడలో
తుషారాల నీరెండలో కుహూ మన్న ఈ గొంతులో
ధ్వనించాలి ఈ ప్రేమలు.
No comments:
Post a Comment